గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో జట్టుకట్టాడు. రిలయన్స్ కు చెందిన ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ కాంపా డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 మార్చిలో మార్కెట్లో రంగప్రవేశం చేసిన కాంపా వేగంగా ఎదుగుతోంది.
ఈ నేపథ్యంలో, భారత్ లో అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో ఒకరైన రామ్ చరణ్ తో భాగస్వామ్యం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. కాగా, రామ్ చరణ్ తో కాంపా ప్రత్యేక యాడ్ ను కూడా రూపొందించారు. ‘కాంపా వాలీ జిద్ద్’ పేరిట ఈ యాడ్ ను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఈ యాడ్ ను ఐపీఎల్ లోనూ, ఇతర వేదికలపైనా, టీవీల్లో, మొబైల్ వేదికలపైనా ప్రసారం చేయనున్నారు.