మన దేశంలోని రోడ్లను అమెరికా రహదారుల కంటే అందంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని… కానీ, రోడ్లు బాగున్నందుకే అమెరికా ధనిక దేశం అయిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఒక సందర్భంలో అన్నారని చెప్పారు. దేశ అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రోడ్లు బాగున్న దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
మన రోడ్లకు సంబంధించి తాను కేవలం హామీలు మాత్రమే ఇవ్వడం లేదని… చేసి చూపిస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని… గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు.