AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతు కూలీగా మారి.. ధాన్యాన్ని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్..

తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొద్దిసేపు రైతు కూలీగా మారి అందరి దృష్టిని ఆకర్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జల్లెడ పట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి ఆయన మెదక్ మండలం పాతూరు గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా, కలెక్టర్‌తో పాటు వచ్చిన అధికారులు కేంద్రంలో కొద్దిసేపు వివిధ పనులు చేశారు. కలెక్టర్ స్వయంగా ధాన్యాన్ని జల్లెడ పట్టారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాలలో ప్యాడీ క్లీనర్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఇదిలా ఉండగా, గతంలో ఆయన ఔరంగాబాద్ గ్రామంలో వరి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ANN TOP 10