ఎప్పటినుండో రిలీజ్ పోస్ట్‌పోన్ చేసుకుంటున్న స్టార్ హీరోల సినిమాలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. 2025 ఎండింగ్ వరకు ఆగడం ఎందుకు అన్నట్టుగా చాలావరకు సినిమాలు ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లోనే విడుదల చేసేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి సినిమాల్లో రజినీకాంత్ ‘కూలీ’ కూడా ఒకటి. లోకేశ్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ‘కూలీ’ రిలీజ్ ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఇదే విషయంపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.
అదే కన్ఫర్మ్
ఇప్పటికే కోలీవుడ్‌లో లోకేశ్ కనకరాజ్‌కు ఒక రేంజ్‌లో పాపులారిటీ ఉంది. యంగ్ డైరెక్టర్ అయినా, దర్శకుడిగా ఎక్కువ సినిమాల అనుభవం లేకపోయినా కొన్నేళ్లలోనే కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోను డైరెక్ట్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు లోకేశ్. అలా తమిళ యూత్‌లో లోకేశ్ కనకరాజ్ పేరు మారుమోగిపోయింది. కమల్ హాసన్ తర్వాత రజినీకాంత్ లాంటి స్టార్ హీరోతో సినిమా అనగానే చాలామంది ప్రేక్షకులు దీనిపై ఎన్నో అంచనాలు పెంచేసుకున్నారు. అసలైతే ఈ మూవీ సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల సమ్మర్‌లో దీని విడుదల కష్టమని ఆడియన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఆగస్ట్‌లోనే విడుదల తేదీని కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్ అందించారు మేకర్స్.
లాంగ్ వీకెండ్
‘కూలీ’ (Coolie) సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 14 తర్వాత లాంగ్ వీకెండ్ కావడంతో కచ్చితంగా అది సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడే మరో సమస్య మొదలయ్యింది. ఎన్‌టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ‘వార్ 2’ కూడా ఇదే రోజు విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. అంతే కాకుండా షూటింగ్ మొదలయినప్పటి నుండి కూడా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు. అయినా కూడా ఆగస్ట్ 14న ‘వార్ 2’ విడుదల ఉంటుందని బీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అప్డేట్స్ లేవు
‘వార్ 2’ (War 2) అనేది హిందీలో ఎన్‌టీఆర్ మొదటి సినిమా. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’లో హీరోగా నటించిన తర్వాత ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో ‘వార్ 2’ గురించి హిందీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. తెలుగులో తన ఫ్యాన్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పెద్దగా బ్రేక్ లేకుండా సాగుతున్నా కూడా దీని నుండి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. కనీసం హీరోలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా ఇంకా రివీల్ చేయలేదు మేకర్స్. కానీ ‘వార్ 2’ మాత్రం ఆగస్ట్ 14నే విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద ఎన్‌టీఆర్ వర్సెస్ సూపర్ స్టార్ పోటీ తప్పదు.