ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అంటూ సుప్రీం ప్రశ్నించింది. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేసారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది జస్టిస్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.
బీఆర్ఎస్ కు కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని, ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశముంటుందని ముకుల్ రోహిత్గీ కోర్టు లో వాదించారు. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్గీ తెలిపారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు. రోహిత్గీ వాదనల పైన జస్టిస్ గవాయ్ స్పందించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా అని ప్రశ్నించారు.