AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాస్టర్ ప్రవీణ్ మృతిపై భార్య, సోదరుడు సంచలన ప్రకటన..!

పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మరణం కలకలంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లు సేకరిస్తున్నారు. ఈ మరణం పైన తాజా గా ప్రవీణ్ సతీమణి.. ఆయన సోదరుడు స్పందించారు. మరో వైపు ప్రవీణ్ మరణానికి ముందు ప్రమాదానికి గురైన మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పడుతూ.. లేస్తూ.. వరుస ప్రమాదా లకు ప్రవీణ్ గురైనట్లు ఈ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. ఇక.. ప్రవీణ్ సతీమణి వెల్లడించిన అంశాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.

 

రాజకీయం చేయద్దు

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణం పైన ఆయన సతీమణి జెస్సికా తో పాటుగా సోదరుడు కిరణ్ స్పం దించారు. ఈ కేసులో రాజకీయ, మతపరమైన ప్రయోజనాలకు వాడుకోవడం ఆపి వేయాలని కోరారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరూ వేర్వేరుగా వీడియో ప్రకటన విడుదల చేశారు. కిరణ్ తన వీడియో లో ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం సత్వరం స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిం దని పేర్కొన్నారు. అత్యుత్సాహంతో సొంత దర్యాప్తు చేస్తున్న వారందరూ సొంత దర్యాప్తులు ఆపా లని కోరారు. ఇది… ప్రవీణ్‌ పగడాల ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని చెప్పారు. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు ప్రవీణ్‌ పగడాల మరణంపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరికొం దరేమో ఆయన మరణాన్ని మతపరంగా, రాజకీయంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

 

l

సతీమణి జెస్సికా అభ్యర్దన

ప్రవీణ్‌ పగడాలను గౌరవిస్తూ… ఇలాంటి చర్యలను ఆపివేయండి. ఆయన ఎప్పుడూ మత సామర స్యాన్నే కోరుకున్నారు. మేం ప్రభుత్వ దర్యాప్తును పూర్తిగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని చెరిపివేయవద్దని కిరణ్ కోరారు. అదే విధంగా ప్రవీణ్ సతీమణి జెస్సికా సైతం ఇదే తరహాలో స్పందించారు. తమకు మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ధన్య వాదాలు చెప్పారు. ఇలాంటి సమయంలో మాకు మీ సహకారం అవసరమని కోరారు. ప్రవీణ్‌ పగ డాల ఒక మంచి భర్త, మంచి తండ్రిగా పేర్కొన్నారు. ఆయన భౌతికంగా లేరని తెలిశాక…తాము అనుభవిస్తున్న బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభు త్వం వేగంగా స్పందించి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. దర్యాప్తుపై తమకు నమ్మకముందని.. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని దెబ్బతీయవద్దని కోరారు.

ANN TOP 10