ఈరోజుల్లో ఏ భాషా ఇండస్ట్రీలో అయినా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే చాలు.. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా దానికి సీక్వెల్ మాత్రం తెరకెక్కాల్సిందే అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందుకే చాలావరకు సినిమాలు కూడా సీక్వెల్స్‌కు స్కోప్ ఉండేలాగా ఎండ్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో ‘అఖండ’ కూడా ఒకటి. టాలీవుడ్‌లో బాలయ్య, బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ అంటే ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కాంబోలో రానున్న ‘అఖండ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ బయటికొచ్చింది.
ఈ ఏడాదిలోనే
ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. వీరు కలిసి సినిమా చేసిన ప్రతీసారి ఒకదానికి మించి మరొకటి హిట్ అవుతూ వచ్చింది. అలా వీరి కాంబోలో చివరిగా వచ్చిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించేశారు మేకర్స్. 2021లో ఈ మూవీ విడుదల కాగా ఆ తర్వాత బాలయ్య, బోయపాటి ఎవరి కమిట్మెంట్స్‌లో వారు బిజీ అయ్యారు. అందుకే ఇప్పటివరకు దీని సీక్వెల్ విడుదలకు ముహూర్తం కుదరలేదు. ప్రస్తుతం ‘అఖండ 2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అందుకే ఈ ఏడాదిలోనే దీనిని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
అప్పుడే రిలీజ్
దసరా సందర్భంగా ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల కానుందని సమాచారం. సెప్టెంబర్ మూడో వారంలో లేదా సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు పండగకు విడుదలయిన ప్రతీసారి దాని రిజల్ట్ మామూలుగా ఉండదు. అలా సంక్రాంతి, దసరా లాంటి పండగలను మెయిన్ టార్గెట్‌గా సినిమాలు విడుదల చేస్తుంటారు స్టార్ హీరోలు. ఇప్పటికే బాలయ్య ఖాతాలో కూడా దసరాకు వచ్చి హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ‘అఖండ 2’ కూడా ఆ లిస్ట్‌లో కచ్చితంగా యాడ్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య సక్సెస్ స్ట్రీక్ మామూలుగా లేదు. అందులో ఈ సినిమా కూడా యాడ్ అవుతుందని నమ్ముతున్నారు.
సక్సెస్ స్ట్రీక్
సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) ఏ సినిమా చేసినా హిట్టే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. వరుసగా యంగ్ దర్శకులను ఎంచుకుంటూ, వారితో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేస్తున్నారు బాలయ్య. ఒకప్పుడు బాలయ్య వరుస ఫ్లాపుల్లో ఉంటే బోయపాటి వచ్చి ఆయనకు హిట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ కాస్త రివర్స్. బోయపాటి శ్రీను చివరిగా దర్శకత్వం వహించిన ‘స్కంద’ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అందుకే వెంటనే బాలయ్యతో కలిసి ‘అఖండ 2’ను ప్రారంభించారు. ఈ మూవీ హిట్ అయితే బోయపాటి మళ్లీ ఫామ్‌లోకి వస్తారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడంతో ‘అఖండ 2’ మినిమమ్ గ్యారెంటీ హిట్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.