AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎట్టకేలకు అఖిల్ అప్‌కమింగ్ మూవీ అప్డేట్ వచ్చేసింది..!

ఇప్పటికే చాలామంది నెపో కిడ్స్ టాలీవుడ్‌లో ఎంటర్ అయ్యి తమ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తున్నారు. కానీ అందరు నెపో కిడ్స్‌కు అదృష్టం ఒకేలా కలిసి రాలేదు. నెపో కిడ్స్ అవ్వడం వల్ల ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం ఈజీనే అయినా ఇక్కడ గుర్తింపు రావాలంటే తమ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి, స్క్రిప్ట్ సెలక్షన్ బాగుండాలి. అలాంటి వాటిలో వెనకబడడం వల్లే అక్కినేని అఖిల్ ఇంకా ఒక్క హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు అఖిల్. హీరోగా తనకు గ్రాండ్ లాంచ్ జరిగింది. కానీ హిట్ మాత్రం పడలేదు. అందుకే కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన అఖిల్.. ఫైనల్‌గా తన అప్‌కమింగ్ మూవీపై అప్డేట్ అందించాడు.

 

అజ్ఞాతంలో అఖిల్

 

అక్కినేని వారసుడిగా ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కూడా మొదట్లో హిట్స్ కోసం ఇబ్బందులు పడ్డాడు. కానీ ‘ఏమాయ చేశావే’తో లవర్ బాయ్ ఇమేజ్ రాగానే కాస్త ట్రాక్‌లో పడ్డాడు. తను కమర్షియల్ సినిమాల్లో నటించి ఫ్లాప్ ఎదుర్కున్న ప్రతీసారి ఒక లవ్ స్టోరీతో హిట్ కొట్టాడు. కానీ అఖిల్ పరిస్థితి అలా లేదు.. తను కమర్షియల్ సినిమాతో వచ్చినా.. లవ్ స్టోరీతో వచ్చినా ఫ్లాపులే ఎదురయ్యాయి. అందుకే వైల్డ్ ఫైర్ అంటూ యాక్షన్‌ను, బడ్జెట్‌ను పెంచి ‘ఏజెంట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఆ మూవీ మరింత భారీ డిశాస్టర్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అఖిల్.. ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాడు.

 

కష్టమంతా వేస్ట్

 

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) చివరి చిత్రం ‘ఏజెంట్’ విడుదలయ్యి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే కష్టపడ్డాడు. తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది. అందుకే దానికోసం అఖిల్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేశాడు కూడా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఈ సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేశాడు. కానీ విడుదలయిన మొదటి రోజు నుండే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్‌కే మూవీ డిశాస్టర్ అని తేలిపోయింది. పైగా సరైన స్టోరీ లేకుండానే ఈ సినిమాను తెరకెక్కించామంటూ నిర్మాత స్వయంగా ప్రకటించాడు. అలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురవ్వడంతో తన సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు అఖిల్.

 

సీక్రెట్‌గా షూటింగ్

 

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన మురళీ కృష్ణ అబ్బూరుతో అఖిల్ తన తరువాతి సినిమాను ప్లాన్ చేశాడు. అఖిల్ కెరీర్‌లో 6వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికీ ప్రారంభమయినా కూడా దీని గురించి అప్డేట్స్ ఏమీ బయటికి రాకుండా జాగ్రత్తపడుతున్నారు మేకర్స్. అందుకే ఫైనల్‌గా ఏప్రిల్ 8న ఈ సినిమాకు ఫస్ట్ లుక్ రివీల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అందించారు. ఇప్పటికే ఈ మూవీకి ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ANN TOP 10