AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ మంత్రి కాకాణి నివాసానికి పోలీసులు..

నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులకు షాక్ ఇచ్చారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. కాకాణి ఇంటికి తాళం వేసి ఉండటం, ఆయనకు, ఆయన పీఏకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో పోలీసులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.

 

విషయంలోకి వెళితే, క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా ఆరోపణల నేపథ్యంలో కాకాణిపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఈరోజు విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, ముందుగానే ఆ సమాచారం తెలుసుకున్న కాకాణి ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

 

ఈ సందర్భంగా ఎస్సై హనీఫ్ మాట్లాడుతూ, అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాణి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. కాకాణికి, ఆయన పీఏకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోందన్నారు. నోటీసుల ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాణి విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ANN TOP 10