AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోదండరాంతో వైఎస్ షర్మిల కీలక భేటీ

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. ఎన్నికలకు ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. మరింత దూకుడు పెంచుతున్నారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలను కలుపుకునే దిశగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు అడుగులు వేస్తోన్నారు.

ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కొదండరాం, వామపక్ష నేతలతో షర్మిల విడివిడిగా భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ జనసమితి కార్యాలయంలో కోదండరాంతో షర్మిల భేటీ జరగనుంది. కేసీఆర్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని కోదండరాంను షర్మిల కోరనున్నారు. నిరుద్యోగుల సమస్యలు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేయడంపై చర్చించనున్నారు.

కోదండరాంతో భేటీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు, మధ్యాహ్నం 2.30 గంటలకు సీపీఎం కార్యాలయంలో తమ్మినేని వీరభద్రంతో షర్మిల సమావేశం కానున్నారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు, టీ సేవ్ ఫోరం ఏర్పాటు, ఇతర అంశాలపై షర్మిల చర్చించనున్నారని తెలుస్తోంది.

ANN TOP 10