‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ సినిమా, ఫస్ట్ అనౌన్స్‌మెంట్ నుండి ఇంటరెస్టింగ్ టర్న్స్ తీసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ మొదట నేచురల్ స్టార్ నాని హీరోతో చేయాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేశారు. నాని కూడా ప్రెస్ మీట్స్ లో ఎల్లమ్మ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. నాని నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ అవుతుంది అనుకుంటున్న టైమ్ లో షాక్ ఇస్తూ… ఈ ప్రాజెక్ట్ నుంచి నాని సైడ్ అయ్యాడు. ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా మార్పు వచ్చింది అనే వార్త వినిపిస్తోంది. ఎల్లమ్మ డిస్కషన్స్ లో భాగంగా హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసి కథ కూడా వినిపించారు. అయితే, కొన్ని కారణాల వల్ల నాని ఈ సినిమా చేయలేకపోయాడు. ఇక సాయి పల్లవి కూడా చివరికి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఇప్పుడు నితిన్ – కీర్తి సురేష్ కాంబినేషన్ ఫైనల్ చేసే దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు.
ఎందుకు నాని నుండి నితిన్ కి మారింది?
ప్రారంభంలోనే ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ నానికి వినిపించారని, ఆయన కథకు ఆసక్తి చూపించినా, షెడ్యూల్ సమస్యలు మరియు ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాక్. ప్రస్తుతం నాని దాదాపు అయిదేళ్లు బిజీగా ఉండే లైనప్ ని సెట్ చేసుకోని ఉన్నాడు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసే ఆలోచనలో ఉన్న నాని… ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి చేయడానికే చాలా సమయం పడుతుంది. ఈ టైంలో ‘ఎల్లమ్మ’ చేయడం ఆయనకు కుదరకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ నితిన్ వైపు వెళ్లింది.
సాయి పల్లవి ఔట్.. కీర్తి సురేష్ ఇన్!
సాయి పల్లవి కూడా ప్రాజెక్ట్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అయినా, ఫైనల్ గా షెడ్యూల్ క్లాషెస్ కారణంగా బయటకు వెళ్లింది. దీంతో మేకర్స్ కీర్తి సురేష్ ను కాంటాక్ట్ చేశారు. ప్రస్తుతం కీర్తి కూడా కథను విని, ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
రంగ్‌దే కాంబినేషన్ రిపీట్ అవుతుందా?
ఇప్పటికే నితిన్ – కీర్తి సురేష్ ‘రంగ్‌దే’ లో కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఇద్దరి కెమిస్ట్రీ, ఎమోషనల్ ట్రాక్, ఫన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ లోనూ ఈ జోడీ రిపీట్ అయితే, మరోసారి వారిద్దరి మధ్య మంచి ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అనేది మేకర్స్ ప్లాన్. కీర్తి సురేష్ చేతిలో కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలు దాదాపు లేవు. ఇలాంటి సమయంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే కీర్తి కెరీర్ కి కూడా హెల్ప్ అవుతుంది.
‘ఎల్లమ్మ’ సినిమాపై ఫైనల్ క్లారిటీ ఎప్పుడు?
ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, కానీ నితిన్ – కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో నటించబోతున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు మూవీపై క్యూరియాసిటీని పెంచాయి. ఫైనల్ గా ‘ఎల్లమ్మ’ లో కీర్తి సురేష్ కన్ఫర్మ్ అవుతుందా? ఒకవేళ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు బయటకి వస్తుంది అనేది చూడాలి.