AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సౌందర్యను చంపించింది మోహన్ బాబే..? నేనే సాక్ష్యం అంటున్న..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యాలలో మహానటి సావిత్రి (Savitri ) తర్వాత అంతటి పేరు దక్కించుకున్న నటీమణి సౌందర్య (Soundarya)మాత్రమే. కట్టు బొట్టుతో సాంప్రదాయంగా కనిపిస్తూనే అభిమానుల ఆరాధ్య దేవతగా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకటేష్ (Venkatesh), జగపతిబాబు (Jagapathi babu) లతో ఎక్కువగా సినిమాలు చేసి ఫ్యామిలీ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె .. చిరంజీవి (Chiranjeevi)వంటి దిగ్గజ హీరోలతో కూడా నటించి తన స్టామినా నిరూపించింది. అంతేకాదు స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే బాబు మోహన్ (Babu Mohan) వంటి కమెడియన్లతో కూడా ఆడి పాడింది. ఇక మోహన్ బాబు (Mohan babu) సరసన ఎన్ని సినిమాలలో నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు వీరిద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధం కూడా ఉందనే వార్తలు అప్పట్లో వినిపించేవి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు దక్కించుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే.. రాజకీయాలలోకి అడుగుపెట్టిన సౌందర్య.. ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బెంగళూరు నుంచి బయలుదేరిన సమయంలో అనుకోకుండా హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది.2004 ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో సౌందర్య మరణించిన విషయం తెలిసిందే. ఈమె మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపివేసింది. ఇప్పటికీ సౌందర్యలేని లోటును ఎవరు తీర్చలేకపోతున్నారు.

 

మోహన్ బాబు సౌందర్యను చంపించారు..

 

ఇకపోతే ప్రచారానికి అని వెళ్ళిన సౌందర్య హెలికాప్టర్ బ్లాస్ట్ అవ్వడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి తెలియలేదు. కానీ సడన్గా సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు అంటూ ఒక వ్యక్తి కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.సౌందర్య మరణించిన దాదాపు 21 సంవత్సరాల తర్వాత అతడు సౌందర్య మరణం పై పలు కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు సినీనటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

 

6 ఎకరాల గెస్ట్ హౌస్ కోసమే ఇదంతా..

 

ఆ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని తెలిపారు. ఇక సినీనటి సౌందర్యకు శంషాబాద్ జల్ పల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని, దానిని విక్రయించమని నటుడు మోహన్ బాబు అడగగా.. సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని ఆమె తెలిపారట. దీనిపై కక్ష పెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్ష్యాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని, ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ని అక్రమంగా అనుభవిస్తున్నాడని తెలిపాడు. అంతేకాదు అక్రమంగా మంచు టౌన్ లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) కి న్యాయం చేయాలని మోహన్ బాబు పై తగు చర్యలు తీసుకోవాలని చిట్టి బాబు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా జల్ పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కోసమే మంచు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ చిట్టిబాబు ఎవరు? ఇంతకాలం ఏమైపోయారు ?ఈ విషయాలన్నీ ఈయనకు ఎలా తెలుసు ? ఈ విషయం తెలిసి ఎన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు? అని నెటిజెన్స్ కూడా ఆరా తీస్తున్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10