వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ పోలీసుల నోటీసులు అందజేశారు. కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి ఎల్లుండి ఉ.11 గంటలకు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (బి).. రెడ్ విత్ 34 సెక్షన్లు నమోదు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై. విక్రాంత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా చెప్పుకొస్తున్న పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు సైతం ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. అయితే, పలు కారణాలతో వీరంతా విచారణకు హాజరుకాకపోవటంతో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో ఈడీ కూడా నోటీసులు పంపింది.