AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కేసీఆర్ చెల్లని రూపాయి.. కేటీఆర్ పిచ్చోడు’.. సీఎం రేవంత్ ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. అలానే కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై సీఎం సెటైర్లు వేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

 

చెల్లని రూపాయి, పిచ్చోడు..

 

జగన్ ను ప్రగతిభవన్ కు పిలిచి రాయలసీమ లిఫ్ట్ కి అనుమతి ఇచ్చింది కేసీఆర్ కాదా అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదని అన్నారు. కేసీఆర్ చెల్లని రూపాయి లాంటి వ్యక్తి అని సీఎం అభివర్ణించారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా ? అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండే కేసీఆర్‌ను గద్దె దింపి అధికారంలోకి వచ్చానని గుర్తు చేశారు.

 

అలానే కేటీఆర్ ఓ పిచ్చొడని ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని.. కేసులకు భయపడితే క్రైమ్ చేయరని తెలిపారు. స్పైడర్ సినిమాలో విలన్ లానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఆ విలన్ లాగానే తెలంగాణలో ఎవరైనా చనిపోతే తీన్ మార్ వేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని తాను ఎక్కడ చూడలేదన్నారు.

 

మెట్రో ఎక్కడుందో చెప్పాలి..?

 

కేంద్ర కిషన్ రెడ్డి రాష్ట్రానికి మెట్రో తానే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తీసుకొస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు. తనకైతే జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తోందని.. కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది ? అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇటీవల అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తే కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లో ఉండి రాలేదన్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ హైదరాబాద్ కు వచ్చేది కూడా కిషన్‌రెడ్డికి తెలియదా? అని ఫైర్ అయ్యారు.

 

మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని.. అదే ఇవ్వమని అంటున్నామన్నారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది బీజేపీ నేతలే అని ఫైర్ అయ్యారు. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు.

 

అంతే కాకుండా తన తన ఢిల్లీ పర్యటన అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం 39 సార్లు కాకపోతే 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని తేల్చి చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకుంటానని అన్నారు.

 

ఇక అంతకు ముందు టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీమ్ సన్నద్ధమవుతోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ మహానరగంలో ఉన్న టీడీఆర్ మొత్తం షేర్లను కొంత మంది రేవంత్ రెడ్డి అనుచరులు కొంటున్నారని కామెంట్ చేశారు. త్వరలోనే FSI అమలు చేసి టీడీఆర్‌‌ లను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ANN TOP 10