కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై వరుపుల తమ్మయ్య బాబు దౌర్జన్యం చేసినట్టు తెలిసింది. ఓ వైద్యురాలితో ఆయన దురుసుగా ప్రవర్తించడాన్ని జనసేన అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.
ప్రత్తిపాడు సీహెచ్ సీ ఘటనపై అందిన నివేదికలు, వివరణలను పరిగణనలోకి తీసుకుని తమ్మయ్య బాబును సస్పెండ్ చేసినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రత్తిపాడు సీహెచ్ సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరం అని ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఈ ఘటనపై జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.