AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చేనేత కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలంగాణలో చేనేత కార్మికులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడికి రూ.లక్ష వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేయబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్ లోని జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి.. తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు చేనేత సంఘాలు, వివిధ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ సర్కారు చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది.

ANN TOP 10