AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత..

కూలిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో పురోగతి లభించింది. సొరంగంలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం గత 16 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన సహాయక సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి.

 

ఆ ప్రాంతంలో సహాయక సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఎస్ఎల్‌బీసీ సొరంగంతవ్వకాల్లో ప్రమాదం ఎనిమిది మంది కార్మికుతోపాటు ఇంజినీర్లు చిక్కుకున్న విషయం తెలిసిందే. వారంతా ప్రాణాలు కోల్పోయారు.

 

వారి మృతదేహాలను గుర్తించి వెలికితీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురి మృతదేహాలను గుర్తించిన సహాయక సిబ్బంది.. ఆదివారం ఒకరి బాడీని వెలికితీశారు. చేతికున్న కడియం ఆధారంగా గురుప్రీత్ సింగ్‌గా ఆ బాడీని గుర్తించారు. మిగితా వారి కోసం రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. వీ వాటరింగ్, టీబీఎం కటింగ్ పనులు చేస్తున్నారు. మిగితా మృతదేహాలను వెలికతీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర ఏజెన్సీలు నిర్విరామంగా శ్రమిస్తున్నారు.

 

కాగా, టన్నెల్‌లో సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన కోటుకు వచ్చి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా గల్లంతైన వారిని వెలికితీయాలని సూచించారు.

 

ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళ నుంచి వచ్చిన జాగిలాలతో అణ్వేషిస్తే సొరంగంలో ఒకే చోట ముగ్గురు ఉన్నట్లుగా కొన్ని ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకుని ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీవాటరింగ్, డీసిల్టింగ్ కొనసాగుతుందన్నారు. మార్చి 11వ తేదీన సమీక్ష తర్వాత మరో ప్రకటన విడుదల చేస్తామన్నారు.

ANN TOP 10