AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పెండెం దొరబాబుకు పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

 

ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో జనసేన విప్ హరిప్రసాద్, జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. కాగా, పెండెం దొరబాబుతో పాటు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఇతర వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలోకి వచ్చారు. వారికి నాదెండ్ల మనోహర్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.

 

ఇవాళ జనసేనలో చేరిన వారిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, గొల్లప్రోలు మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి వీర వెంకట సత్యనారాయణ కూడా ఉన్నారు.

ANN TOP 10