AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

SLBC టన్నెల్ ప్రమాదం: రంగంలోకి క్యాడవర్ డాగ్స్..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో లోపల చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. వీరి జాడను గుర్తించేందుకు 14 వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బహుముఖాలుగా ప్రయత్నం చేస్తున్నాయి.

 

రంగంలోకి క్యాడవర్ డాగ్స్

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఎక్స్పర్ట్స్ అయినా రెస్క్యూ బృందాలను నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో భాగంగా కేరళ రాష్ట్రానికి చెందిన క్యాడవర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు. నేడు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్ లోపలికి వెళ్లి వారి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

15 ఫీట్ల లోపల ఉన్న మనుషుల జాడను గుర్తించే క్యాడవర్ డాగ్స్

మ్యాల్నోయిస్ బ్రీడ్ కి చెందిన క్యాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్న మనుషులు జాడను గుర్తిస్తాయి. ఈ క్రమంలోనే ఈ డాగ్స్ ద్వారా టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం తవ్వకాలు జరిపేందుకు అవసరమైన సామాగ్రిని లోకో మోటర్ తీసుకువెళ్లింది. సామాగ్రితో పాటుగా మొత్తం 110 మంది సిబ్బంది లోపలికి వెళ్లి ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.

 

టన్నెల్ లో కొనసాగుతున్న ఆపరేషన్

సంఘటన స్థలంలో పరిస్థితులను నాగర్ కర్నూల్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం క్యాడవర్ తీసుకువెళ్లిన బృందం అక్కడ గల్లంతైన వారి ఆచూకీని అన్వేషించి మధ్యాహ్నం రెండున్నర గంటలకు టన్నెల్ నుంచి బయటకు రానుంది. టన్నెల్ లోపల జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్ డి ఆర్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ బెల్జియం కూడా వెళ్లారు.

 

క్యాడవర్ డాగ్స్ అయినా వారిని గుర్తిస్తాయా?

అయితే ఇప్పటికే స్నిప్పర్ డాగ్స్ ను లోపలికి పంపించిన ఫలితం లభించలేదు. ఇప్పుడు క్యాడవర్ జాగిలాలు టన్నెల్ లోపలికి వెళ్లి గల్లంతయిన మనుషులు మృతదేహాలను గుర్తించనున్నాయి. ఎన్నో గుర్తుతెలియని మిస్టరీ కేసులను పరిష్కరించడంలో ఈ డాగ్స్ ప్రత్యేకమైన శిక్షణను పొందాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ డాగ్స్ పైన భారీ అసలు పెట్టుకున్నారు అధికారులు.

ANN TOP 10