సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ లైన్ ఎవరు దాటినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అని అన్నారు.
అయితే, తనకైనా.. చిన్నారెడ్డికైనా.. రేవంత్ రెడ్డికైనా ఒకే చర్యలు ఉండాలని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలనుకున్నవారిలో మల్లన్న కూడా ఒకరు అని మధుయాష్కీ చెప్పారు.
అంతేగాక, తీన్మార్ మల్లన్న లేవనెత్తుతున్న అంశాలపై వివరణ ఇవ్వాల్సింది కూడా సీఎం రేవంత్ రెడ్డేనని మధుయాష్కీ అన్నారు. అయితే, బీసీలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం జరుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు. మల్లన్న లేవనెత్తుతున్న అంశాలపై పీసీసీ కూడా స్పష్టతనివ్వాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశారు.. మరి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు.
కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా తనను పిలవలేదని మధుయాష్కీ గౌడ్ అన్నారు. కులగణన విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని మధుయాష్కీ తెలిపారు.
తీన్మార్ మల్లన్న ఏమన్నారంటే?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని, ఈడబ్ల్యూఎస్రక్షించుకోవడానికే కుట్ర పన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఉంటే ప్రశ్నిస్తున్నాననే సస్పెండ్చేశారని అన్నారు. తనను బహిష్కరించినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
అంతేగాక, బీసీ కులగణన తప్పుల తడక అని, అలాంటి ప్రతులను కాల్చడం తప్పా అనిమల్లన్న ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్పకడ్బందీగా చేశారని ప్రశంసించారు. కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని ఆరోపించారు. బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని, ఈడబ్ల్యూఎస్రక్షించుకోవడానికే ఇలా కుట్ర పన్నారని అన్నారు.
కులగణన సర్వేకు బాధ్యత తనదేనని సీఎం రేవంత్ ఒప్పుకుంటారా? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. సర్వే తప్పని నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్‌విసిరారు. రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి బ్రదర్స్అనేక విమర్శలు చేశారని గుర్తు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఒక న్యాయం, తనకొక న్యాయమా? అంటూ నిలదీశారు. అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకే ఉంటుందా, బీసీలకు ఉండదా? అని ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న ప్రశ్నించారు.