AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యుత్ షాక్‎తో విద్యార్థిని మృతి

ప్రభుత్వ పాఠశాలలో విషాదం..
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మంచన్‎పల్లి ప్రభుత్వ పాఠశాలలో(Government school) ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు(Electrical wires) తగిలి దీక్షిత (8) నాల్గవ తరగతి విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బాత్రూమ్ వద్ద వేలాడుతున్న కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే బాలిక కుప్పకూలిపోయింది. చేతితో వైర్లు తొలగించే ప్రయత్నం చేయడంతో విద్యుత్‌షాక్‌కు గురైంది.

మన ఊరు – మన బడిలో భాగంగా పాఠశాలలో మరమ్మతులు జరుగుతున్నాయి. పాఠశాల ఉపాధ్యాయులు, సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే మా కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలిక మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10