AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ల రాక ఉంటుంది. అయితే అందంతో పాటుగా పెద్ద చదువులు చదువుకొని సినిమాల పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చినవాళ్లు ఎందరో ఉన్నారు. ఎంబీబీఎస్ చదువుతూ ఇటు హీరోయిన్లుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో కట్టిపడేస్తున్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ కామాక్షి భాష్కర్ల కూడా ఒకరు.. ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ పోషిస్తూ సత్తా చాటుతున్న అచ్చ తెలుగమ్మాయి.. ఈమె గురించి అందరికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు.. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆమె ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాల గురించి షేర్ చేసుకుంది. అవేంటో తెలుసుకుందాం..

 

కామాక్షి 2018 మిస్ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. అంతకు ముందు చైనాలో ఎంబీబీఎస్ చేసింది. అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లుగా డాక్టర్ గా పనిచేసింది. ప్రియురాలు అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన కామాక్షి.. ఆ తర్వాత మా ఊరి పొలిమేర తో మరింత పాపులర్ అయ్యింది. ఈ మూవీతో కామాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగు లో ఆఫర్స్ వచ్చాయి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న ఈమె క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో బయట పెట్టింది. సినిమా ఇండస్ట్రీ గురించే కాదు. లోపల జరుగుతున్న బాగోతాల గురించి బయట పెట్టింది. అవేంటో ఒకసారి చూద్దాం..

 

కామాక్షి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కి రావడం అంత ఈజీ కాదు.. ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. క్యాస్టింగ్ కౌచ్ నిజమే. అవన్నీ ఎదుర్కొని నిలబడితేనే ఇండస్ట్రీలో హిట్ టాక్ ను సొంతం చేసుకుంటారు అని ఆమె అన్నారు. నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పింది. అలాగే తాను డాక్టర్ గా ఉన్నప్పుడు చైనా లో బొద్దింకలను, తేళ్లను, పాములను తిన్నాను అని చెప్పింది. అలాగే పొలిమేర 3 మూవీ ఎప్పుడొస్తుందో మూవీ చెప్పింది. అయితే ఆ మూవీలో కేవలం ఆమె హీరోయిన్ గా మాత్రమే కాదు. ప్రొడ్యూసర్ కూడా చేస్తున్న విషయాన్ని బయటపెట్టింది.. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఇక పోతే సినిమాలు మాత్రమే కాదు.. ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ చేసి అలరించింది. ఎక్కుగా ఢీ గ్లామర్స్ రోల్స్ పోషిస్తుంది కామాక్షి. కానీ నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోంది.. పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం లో ఉన్న ఈ భామ హాట్‌ లుక్‌లో కనిపిస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మోడ్రన్ వేర్‌ లో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్‌ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10