AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎస్సై తుది రాత పరీక్ష తేదీలు వెల్లడి…

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. ఈ మేరకు తెలియజేస్తూ శనివారం (ఏప్రిల్‌ 1) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సై తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో నేటి (ఏప్రిల్‌ 3) నుంచి 6వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లపై అభ్యర్థి ఫొటో తప్పనిసరిగా అతికించాలని, లేనిపక్షంగాలో పరిగణనలోకి తీసుకోబోమని బోర్డు స్పష్టం చేసింది.

ANN TOP 10