జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్
రాష్ట్రంలో అధికార ప్రభుత్వంలో ప్రధాన పార్టీలు అయిన తెలుగుదేశం,జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన పాకలపాటి రఘువర్మను* ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ తో గెలిపించాలని జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు.సోమవారం పాలకొండ పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్ తో పాటు పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో గల ఉపాధ్యాయ ఓటర్లతో ఆయన సమావేశమయ్యారు.కూటమి పార్టీలు మద్దతిస్తున్న పాకలపాటి రఘువర్మను గెలిపించాల్సిందిగా కోరుతూ,కూటమి పార్టీల పట్టణ క్యాడరతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చి పరిష్కరించడానికి తనవంతు కృషి చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మను,మరోసారి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.రఘువర్మ నిష్కల్మషమైన వ్యక్తిగా పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రతి వారికి అందుబాటులో ఉంటారని చెప్పారు.అవినీతికి అమడ దూరంలో ఉండే ఆయన వ్యక్తిత్వం గొప్పదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టిందన్నారు.గత ప్రభుత్వం పాఠశాల విద్యను భ్రష్టు పట్టించేలా తీసుకువచ్చిన 117 జీవోను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థల తరహాలో నిలిపేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలుచేపట్టారన్నారు. చక్కనైన మెనూతో సర్కారీ పాఠశాలల్లో,పలు ప్రభుత్వ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలల్లో పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ఉపాధ్యాయ కుటుంబాల తరపున చట్టసభల్లో ప్రస్తావించి,వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు,రఘు వర్మ వంటి మేధావి సేవలు ఆవశ్యకం అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే మార్గాలు ఏర్పడాలంటే రఘువర్మ వంటి నిష్కల్మషమైన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు.ఈ నెల 27 తేదీన జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి సర్కార్ బలపరిచిన పాకలపాటి రఘువర్మకు ఒకటవ ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు.విద్య రంగంలో సుదీర్ఘ కాలం పాటు పరిష్కారానికి నోచుకోని ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడం జరుగుతుందన్నారు.ప్రభుత్వ విద్య సంస్థల్లో మౌలిక వసతుల సదుపాయాలతో పాటు, ఉపాధ్యాయ* , *అధ్యాపక,ఆచార్యులకు సంబంధించిన పలు సర్వీస్ మేటర్లను పరిష్కరించేందుకు కూటమి సర్కార్ చిత్తశుద్ధితో* ఉందన్నారు.ఇందుకు ఏపీ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మెట్ట వైకుంఠరావు, ఏపీ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మల నిబ్రం, ఏపీ తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ టంకాల దుర్గరావు, అద్యాపకులు,ఉపాద్యాయులు,ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు