మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ గుంటూరు కారం అనే సినిమా చేశాడు. 2024 సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని ఈమధ్య ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఎక్కకపోవడంతో ప్రస్తుతానికి ప్రాజెక్టు పక్కన పెడదామని చెప్పాడట. అందుకే ఆయన అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే సినిమా రిలీజ్ ఏడాది పూర్తయిన తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా మీద ఇంకా ఫోకస్ చేయలేదని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. నిజానికి హారిక హాసిని సహా సితార ఎంటర్టైన్మెంట్స్ లో అన్ని సినిమాలకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన తర్వాతే సినిమాలు పట్టాలెక్కుతాయి. ప్రస్తుతానికి ఇలా తన భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాల గ్రీన్ సిగ్నల్ విషయంలోనే ఆయన కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన మళ్ళీ అల్లు అర్జున్తో కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.