AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎల్ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)పై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు నేడు సమీక్ష నిర్వహించారు.

 

అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా క్రమబద్ధీకరణకు అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

పది శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఔట్లలో మిగిలిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశమివ్వాలని నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద చెల్లింపులు జరిపి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ANN TOP 10