AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘విశ్వంభ‌ర’ మూవీలో మ‌రో మెగా హీరో..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోన్న తాజా చిత్రం విశ్వంభ‌ర‌. యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఓ సోషియో ఫాంట‌సీ క‌థ‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కీల‌క అప్‌డేట్ ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

 

ఇందులో మ‌రో మెగా హీరో సాయి దుర్గా తేజ్ అతిథి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని సినీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఆయ‌న పాత్ర తాలూకు షూట్ మూడు రోజులు ఉంటుంద‌ని… ఇవాళ తొలిరోజు సాయి షూటింగ్ లో పాల్గొన్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా చిరు సినిమాల్లో మెరిసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మెగా మేన‌ల్లుడి వంతు వ‌చ్చింది.

 

ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. రెండు పాట‌లు, కొద్ది ప్యాచ్‌వ‌ర్క్ మిన‌హాయిస్తే షూట్ మొత్తం పూర్త‌యిన‌ట్లేన‌ని టాక్. కానీ, మూవీకి సీజీ వ‌ర్క్ చాలా ఎక్కువ‌. అది కూడా కీల‌క‌మైన బ్లాక్ లు ఉన్నాయ‌ట‌. దాంతో ఇంత‌కుముందు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన‌ట్లు మే లో సినిమా విడుద‌ల కాక‌పోవ‌చ్చ‌ని స‌మాచారం

.

 

ANN TOP 10