AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘గ్రోక్3’ని మించింది ఈ భూమ్మీద లేదు: ఎలాన్ మస్క్..

రానున్న కాలంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)దే హవా అని టెక్ నిపుణులు చెబుతుండడం తెలిసిందే. ఇప్పటికే చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, చైనా డీప్ సీక్, మెటా ఎల్ఎల్ఏఎంఏ వంటి ఏఐ మోడళ్లు రంగంలో ఉన్నాయి. టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ఏఐకూడా ఈ రేసులో ఉంది.

 

ఇప్పటికే ఎక్స్ఏఐ గ్రోక్ ఏఐ మోడల్ ను తీసుకువచ్చింది. గ్రోక్ ను ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై అందుబాటులో ఉంచారు. తాజాగా, మరింత అభివృద్ధి చేసిన గ్రోక్3ని తీసుకువస్తున్నారు.

 

దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. గ్రోక్3 అంతటి తెలివైన ఏఐ చాట్ బాట్ భూమ్మీద మరొకటి లేదని అన్నారు. ఇది మంగళవారం ఉదయం 9.30 నిమిషాల నుంచి అందుబాటులోకి రానుందని వెల్లడించారు.

 

కాగా, గ్రోక్3లో టెక్ట్స్ టు వీడియో ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. గ్రోక్3 రాక నేపథ్యంలో ఏఐ రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది.

ANN TOP 10