AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్జీవీపై విలన్ షాకింగ్ కామెంట్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న నాగార్జున వెంకటేష్ చిరంజీవి లాంటి హీరోలతో ఆయన ఒకప్పుడు వరుస సినిమాలు తెరకెక్కించారు. ఆయన తీసిన ప్రతి సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని రాబట్టింది. ఎన్నో రికార్డులను అవార్డులను సొంతం చేసుకున్న రాంగోపాల్ వర్మ ఈమధ్య సినిమాలకన్నా వివాదాలతో బాగా ఫేమస్ అవుతున్నారు. ఆయనకు సంబంధం లేని విషయంలో కూడా వర్మ ట్వీట్ వార్ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఆయన చేసే రచ్చ అంతా కాదు. ఎవరేమనుకున్నా నాకేంటి నా ఇష్టం అని ఆయన ఏం చెప్పాలనుకుంటారో అది మాత్రమే చెప్తారు. అయితే ఈ మధ్య వర్మ తీరుపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ విలన్ అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కూడా ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

అభిమన్యు సినిమాలు…

 

టాలీవుడ్ విలన్లలో అభిమన్యు సింగ్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల అందరి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నిజానికి ఈయన తెలుగు నటుడు కాదు. బాలీవుడ్లో పలు సినిమాలో నటించిన ఈయన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2010లో ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రముఖ రాజకీయ నాయకులైన పరిటాల రవి, అతని విరోధి మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డిల వాస్తవిక గాధతో రూపొందించబడింది. ఇది అధికారికంగా 2010 ఆగస్టు నెలలో విడుదల కావలసివున్నాకానీ 2010 అక్టోబరు 22న విడుదలైంది.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత అభిమన్యుకి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒక్క సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో ఆర్జీవి పై షాకింగ్ కామెంట్స్ చేశారు..

 

ఆర్జీవి పై విలన్ కామెంట్స్..

 

తెలుగులో ఈ విలన్ కి మంచి లైఫ్ ఇచ్చింది మాత్రం రక్త చరిత్ర సినిమానే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవి వల్లే ఇతని లైఫ్ మారిపోయిందని ఇంటర్వ్యూ లో అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్జీవి సార్ వల్లే నేను విలన్ గా తెలుగులోకి పరిచయమయ్యాను. ఈరోజు నా లైఫ్ ఇలా ఉండ దానికి కారణం ఆయనే అని ఆర్జీవి పై ప్రశంసలు కురిపించారు టాలీవుడ్ విలన్. అయితే ఒకప్పుడు చాలామందిని స్టార్స్ గా తయారు చేసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారడం ఆయనకు బాధగా అనిపిస్తుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆర్జీవి మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్న వారిలో నేను ఒకడిని. మిగిలినవన్నీ పక్కన పెడితే, సినిమాల మీద ఫోకస్ పెడతారు అని ఇన్ డైరెక్టుగా వర్మకు కౌంటర్ ఇచ్చాడు అభిమన్యు.. ఇక ఆయన సినిమాల్లో మళ్లీ నటించాలని ఉంది అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. మొత్తానికి ఆర్జీవి గురించి తన మనసులోని మాటలని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు అభిమన్యు. ఆ వీడియో వైరల్ అవడంతో అటు ఆర్జీవి ఫాన్స్, ఇటు తెలుగు సినిమా అభిమానులు కూడా వర్మ మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నామని కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈ కామెంట్లపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి

ANN TOP 10