ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కూటమి పార్టీల నుంచి రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి అభ్యర్ధులు ప్రచారంలో ఉన్నారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు ఎన్నికల్లో గెలుపు సవాల్ గా మారుతోంది. దీంతో, చంద్రబాబు పదే పదే మూడు పార్టీల నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు అవసరాన్ని వివరిస్తున్నారు. మరి.. గ్రౌండ్ లో పరిస్థితి ఏంటి. కూటమి గెలిచేనా.. ఏం జరుగుతోంది..
ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈ నెల 2న పోలింగ్ జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పైన గ్రాడ్యుయేట్ల మూడ్ ఏంటి అనేది ఈ ఎన్నికల ద్వారా స్పష్టత రానుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన 2018 లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. ఇప్పుడు ఎనిమిది నెలల కూటమి పాలన పైన గ్రాడ్యుయేట్లు ఓటు ద్వారా తమ అభిప్రాయం స్పష్టం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అవసరం తెలిసిన చంద్రబాబు మూడు పార్టీల నేతలను పదే పదే అలర్ట్ చేస్తున్నారు. గెలుపు కోసం సమన్వయంతో పని చేయాలని నిర్దేశిస్తున్నారు.
సమన్వయం పై సందేహాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ కల్పన.. డీఎస్సీ నిర్వహణ అమలు పైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోనూ లోపం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి – క్రిష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు తున్నాయి. గుంటూరు-కృష్ణాజిల్లాల పరిధిలో నాయకుల సమన్వయం కొరవడడంతో ఇక్కడ టీడీ పీ అభ్యర్దిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజా నేరుగ గ్రాడ్యుయేట్లకు ఫోన్లు చేసి మద్దతు కోరుతు న్నా రు. మిత్రపక్షాలతో పాటుగా సొంత పార్టీ సీనియర్ల నుంచి సహకారం అంతగా కనిపించటం లేదు.
చంద్రబాబు దిశా నిర్దేశం
ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేదు. కానీ, వామపక్ష మద్దతు దారులు అభ్యర్దులుగా గట్టి పోటీ ఇస్తు న్నారు. ఇక, గోదావరి జిల్లాల్లోనూ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పేరాబత్తు ల రాజశేఖర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేరాబత్తులకు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు తో పాటుగా ఇతరులు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక.. స్థానికంగా కూటమి నేతల మధ్య సమన్వయ లేమి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, చంద్రబాబు మూ డు పార్టీల నేతలతో వరుసగా టెలి కాన్ఫిరెన్స్ లు నిర్వహిస్తున్నారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలి వివరించాలని సూచించారు. ప్రతి ఎన్నికా పరీక్షవంటిదేనని…మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలని నిర్దేశించారు. దీంతో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.