ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల హామీల అమలు పైన ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. వైసీపీ నేతల పైన కేసులు.. అరెస్ట్ ల వ్యవహారం రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుం టోంది. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ తాజాగా వంశీ అరెస్ట్ వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కీలకంగా మారుతోంది.
వంశీ అరెస్ట్ తో
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని పోలీసులు అరెస్ట్ చేసారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరిం చి, కేసు నుంచి తప్పుకొనేలా చేశారన్న ఆరోపణలపై వంశీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా, కోర్టు రిమాండ్ విధించటంతో జైల్లో ఆయనకు ఒకటో నెంబర్ బ్యారక్ గదిని కేటాయించారు. భద్రతా చర్యల్లో భాగంగా వంశీ బ్యారక్ కు అధికారులు పరదాలు కట్టినట్లు సమా చారం. వంశీ జైల్లోని ఇతర ఖైదీలకు కనిపించకుండా పరదాలు కట్టినట్లు తెలుస్తోంది. అదే విధం గా వంశీ బ్యారక్ వైపు ఖైదీలు ఎవరూ వెళ్లకుండా భద్రతా ఏర్పాటు చేసి.. సీసీ కెమేరాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వైసీపీ నిరసన
వంశీ అరెస్ట్ పైన ఆయన సతీమణితో సహా వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అక్ర మంగా వంశీని అరెస్ట్ చేసారని ఆరోపిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ నేతలు సైతం వంశీ కేసు కోర్టు లో నిలవదని చెప్పుకొచ్చారు. అయితే, వంశీని ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేసినట్లు టీడీపీ ముఖ్య నేతలు వెల్లడించారు. వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఫిర్యాదు దారుడైన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని వంశీ ఇంటికి తీసుకురావటం.. అక్కడ నుంచి కారులో విశాఖ తరలింపు.. కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో ఉండటంతో.. వాటిని పోలీసులు సేకరించారు. వీటి ఆధారంగానే వంశీ పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
జగన్ నిర్ణయం
ఇదే సమయంలో వంశీ పైన పెండింగ్ కేసుల విషయంలోనూ పోలీసులు విచారణకు సిద్దమ య్యారు. వంశీ అరెస్ట్ తరువాత ఆయన సతీమణితో జగన్ మాట్లాడారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు (మంగళవారం) తిరిగి రానున్నారు. గన్నవరం నుంచి నేరుగా విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. గతంలో అరెస్ట్ అయిన పార్టీ నేతలు పిన్నెల్లిని నెల్లూరు జైల్లో, నందిగం సురేశ్ ను గుంటూరు జైల్లో జగన్ పరామర్శించారు. వంశీ అరెస్ట్ పైన జగన్ అక్కడే స్పందించనున్నారు. ప్రభుత్వం పైన పోరుబాట.. జిల్లాల పర్యటనల పైన ప్రకటనకు జగన్ సిద్దమయ్యారు.