AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిపోర్ట్ లో సంచలన విషయాలు..! ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

మంచి.. చెడు.. ఒకప్పుడు మనిషి పోయిన తర్వాత మాట్లాడుకునేవారు. ఇప్పుడు వెంట వెంటనే ఫలితాలు వస్తున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ గన్నవరం వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈయన గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆయన్ని నొటోరియస్ క్రిమినల్‌గా ప్రస్తావించారు. ఈ లెక్కన వంశీ ఆగడాలను ఎన్నో ఇప్పుడు చూద్దాం.

 

వంశీ గురించి కొత్త కొత్త విషయాలు

 

మాజీ ఎమ్మెల్యే వంశీ గురించి ఏపీలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. తన చేతికి మట్టి అంటుకోకుండా టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నుంచి తప్పించుకోవాలని పక్కాగా స్కెచ్ వేశారు. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచినట్టు అయ్యింది. ఫిర్యాదు చేసిన వాళ్లని బెదిరించి పిటిషన్ వెనక్కి తీసుకుంటే.. తనపై ఎలాంటి కేసు ఉండదు.. ఎవరూ అరెస్ట్ చేయలేరని భావించారు. పక్కగా అలాగే అమలు చేశారు.. కాకపోతే ఈ వ్యవహారం బెడిసికొట్టింది. ఫలితంగా అరెస్టయి జైలుకి వెళ్లిపోయారు.

 

తనకు గిట్టని వారి పట్ల దారుణంగా ప్రవర్తించేవారట వంశీ. ఓ ఎన్నారై ఉదంతమే ఇందుకు ప్రత్యేక ఉదాహరణ. ప్రవాసాంధ్రుడైన ఓ యువ టెక్కీ టీడీపీకి అనుకూలంగా సోషల్ మీడియలో పోస్టులు పెడుతున్నాడనే కారణంతో అరెస్ట్ చేయిచాడు. అంతటితో ఊరుకోలేదు.అతడిపై స్వలింగ సంపర్కుడనే ముద్ర వేశాడని చెబుతున్నారు టీడీపీ కార్యకర్తలు. వంశీ ఆదేశాల మేరకే అప్పట్లో ఆ ఇంజనీర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రకటనలు ఇచ్చారనే విమర్శలు సైతం లేకపోలేదు.

 

వల్లభనేని వంశీ ఇంటి నుంచి బయలు దేరితే నాలుగు నల్ల కారుల కాన్వాయ్ వస్తుందట. ఒక్కో కారులో నలుగురు వ్యక్తులుంటారట. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కేశినేని నానికి ఎంపీ టికెట్ వస్తుందని ఓ జర్నలిస్టు రాసుకొచ్చారట. టీడీపీ పాదయాత్రలో ఆ జర్నలిస్టుని పిలిచి నానికి టికెట్ ఇస్తున్నట్లు ఎవరు చెప్పారని ఆయన్ని ప్రశ్నించారట వంశీ. ఈ విషయం టీడీపీ అధినేత చెవిలో చెప్పారా? ఆ జర్నలిస్టును బెదిరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈలోగా కొందరు టీడీపీ అభిమానులు వచ్చి ఆ జర్నలిస్టు గురించి చెప్పడంతో సైలెంట్ అయ్యారట వంశీ.

 

ఇక రిమాండ్ రిపోర్టులో వంశీ గురించి పోలీసులు ప్రస్తావించిన అంశాలు అన్నీ ఇన్నీ కావు. వంశీ నొటోరియస్ క్రిమినల్ అని, ఆయనకు పెద్ద నేర చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఆయనకు న్యాయం, చట్టమన్నా లెక్కలేదని తెలిపారు. ఆయనపై దాదాపు 16 వరకు క్రిమినల్ కేసులు అని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లెక్కన వంశీ ఆగడాలు ఏ రేంజ్ లో ఉండేవని చెప్పడానికి రిమాండ్ కాపీయే ఒక ఉదాహరణ.

 

గన్నవరం నియోజకరవర్గంలో వంశీ సాగించిన ఆగడాలు చాలానే ఉన్నాయి. సూరంపల్లిలో పార్థసారధికి చెందిన 9 ఎకరాల భూమిని వంశీ అనుచరులు బలవంతంగా రాయించుకున్నారు. బినామీ పేరు మీద అక్రమ మైనింగ్ తవ్వకాలు అడ్డగోలుగా సాగించారట. సెంటు భూమి కోసం మూడు కొండలు సైతం కరిగించేశారట. ఇక నియోజకవర్గంలో వెంచర్లు, టౌన్ షిప్ లు ఏర్పాటు చేస్తే అందులో వాటాలు సైతం ఇవ్వాల్సిందేనని అక్కడి ప్రజల మాట.

 

గురువారం ఉదయం వంశీని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ లో ఆయన ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. వారిని చూసి ఒక్కసారిగా షాకయ్యారట వంశీ. తాము ఎందుకు వచ్చారో పోలీసులు ఆయనకు వివరించారు. ఆ తర్వాత తాను డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పి ఇంట్లో వెళ్లి చాలా సేపు వరకు తలుపు తీయలేదు. ఆ సమయంలో అరెస్ట్ నుంచి తనను కాపాడాలని వైసీపీ నేతలకు మొరపెట్టుకున్నారట. ఇప్పుడు తామేమీ చేయలేమని చేతులెత్తేశారట. ఎంత సేపటికీ వంశీ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో పోలీసులు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో వచ్చారని అంటున్నారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు ఈ విషయాన్ని బయటపెట్టారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10