AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శృతిమించిన ర్యాగింగ్.. ప్రైవేటు పార్ట్స్ కు డంబెల్స్ వేలాడగట్టి..

కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల వేధింపులకు సంబంధించిన దారుణమైన ఘటనలు వెలుగులో వస్తున్నాయి. కాలేజీలో చదివేందుకు వచ్చే జూనియర్లపై విచక్షణ మరిచి చిత్ర హింసలకు గురి చేసిన సీనియర్ల వేధింపులు దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ర్యాగింగ్ పేరుతో.. జూనియర్ల ప్రైవేట్ పార్టుల్లోకి ఏకంగా జిమ్ చేసే డంబుల్స్ దూర్చుతూ.. రాక్షసంగా ప్రవర్తించిన ఘటనలు ఆశ్చర్యపరుస్తున్నాయి.. దువుకునేందుకు వచ్చిన విద్యార్థులు.. అసభ్యకరంగా, విచక్షణ లేకుండా ప్రవర్తించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. ఈ తీవ్ర చర్యలకు పాల్పడిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీంతో.. వేధింపులకు కారణం అయిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు.

 

కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో చదువుకునేందుకు అడుగుపెట్టిన జూనియర్లకు సీనియర్ల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. అప్పడే కాలేజీలో అడుగుపెట్టిన సీనియర్ల నుంచి ఎవరైనా సలహాలు, సూచనలు కోరుకుంటారు. తమ తర్వాత వచ్చిన వారికి సరైన కెరీర్ ఎంచుకునేందు తోడ్పడాలి. కానీ.. ర్యాగింగ్ పేరుతో తీవ్ర భౌతిక, మానసిక దాడులకు పాల్పడుతున్నారు కొందరు విద్యార్థులు. పరిధి దాటనంత వరకు ఏదైనా బాగానే ఉంటుంది. కానీ.. ర్యాంగింగ్ పేరుతో ఏకంగా జూనియర్ విద్యార్థులపై దాడులకు పాల్పడడంతో అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

 

ఈ పాలిటెక్సిక్ కాలేజీలో మూడో ఏడాది చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. జూనియర్లపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జూనియర్లను బట్టలు ఇప్పించి మారీ వేధిస్తున్నారు. వారి ప్రైవేట్ పార్టుకు బలవంతంగా డంబుల్స్ వేలాడదీశారు. జామెట్రీ బాక్స్ లోని కంపాస్ లతో విద్యార్థులను గాయపరుస్తున్నారు. వీరి ప్రవర్తనకు అనేక మంది జూనియర్లు దారుణంగా గాయపడ్డారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఈ దారుణాలు కొనసాగుతుండగా, వేధింపులు తాళలేక విద్యార్థులు పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో.. వీరి క్రూరత్వం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

 

విద్యార్థుల్ని వివిధ శిక్షల పేరుతో తీవ్రంగా గాయపరిచిన సీనియర్ విద్యార్థులు.. వారికి గాయలైనప్పుడు సైతం దారుణంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జూనియర్ విద్యార్థులు పేర్కొన్నారు. గాయల దగ్గర లోషన్ రాసి మంటపుట్టేలా చేసేవారని, వారు నొప్పితో ఏడుస్తుంటే.. సీనియర్లు నవ్వుకునే వారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్నిసార్లు గాయాలకు రాసుకునే లోషన్ ను నోట్లో బలవంతంగా పోసోవారని.. ఆ ఘటనలన్నింటినీ చిత్రీకరించి.. ఎవరికైనా బయటకు చెబితే ఆ వీడియోలు బయటపెడతామని బెదిరించే వాళ్లని తెలిపారు. అక్కడ జరిగే ఘటనల గురించి చెబితే, జూనియర్లు చదువుకోకుండా చేస్తామని, ఒక్కరు కూడా కాలేజీలో ఉండరంటూ తీవ్రంగా భయపెట్టేవారని తెలిపారు.

 

అలాగే.. ప్రతీ ఆదివారం నాడు సీనియర్లు మందు పార్టీ చేసుకుంటారని తెలిపిన విద్యార్థులు.. దానికయ్యే ఖర్చును జూనియర్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేవారని చెప్పారు. అందుకు ఎవరైనా అంగీకరించకుంటే.. వారికి తీవ్రంగా కొట్టేవారని, ఇంకా అనేక చిత్రహింసలకు గురిచేసే వారంటూ తెలిపారు. ఈ వేధింపులు భరించలేక ఓ విద్యార్థి.. అతని తండ్రికి విషయం చెప్పగా, ఆయన ప్రోద్భలంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేశారు.

 

పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో అనేక ఆశ్చర్యకరమైన, దిగ్బృంతికరమైన విషయాలు వెలుగులోకి రావడంతో.. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై సత్వరమే స్పందించిన పోలీసులు.. నిందితులైన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు విద్యార్థులపై ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కాగా.. కొచ్చిలో 15 ఏళ్ల పాఠశాల విద్యార్థి ఆత్మహత్య ఘటన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొచ్చిలో మరణించిన విద్యార్థి.. తన సీనియర్లు వేధించడం వల్లే చనిపోయాడంటూ అతని తల్లి ఆరోపించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10