AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చార్జీలను పెంచే యోచనలో హైదరాబాద్ మెట్రో..? అవే కారణాల..?

హైదరాబాద్‌లో మెట్రో ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమయ్యిందా? మెట్రో ప్రయాణికులపై వడ్డన తప్పదా? బెంగుళూరు తరహాలో రేట్లు పెంచేందుకు ప్లాన్ చేస్తోందా? రద్దీ ఎక్కువగా ఉండడం, కొత్త ట్రైన్స్, కోచ్‌ల కొనుగోలు కోసం నిధుల అవసరమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

మెట్రో ఛార్జీల పెంపు!

 

హైదరాబాద్ మెట్రో ప్రారంభించి దాదాపు ఏడేళ్లు పూర్తి అవుతోంది. ఏడేళ్లుగా ఒకే చార్జీలు ఉన్నాయి. ఐదేళ్లు పూర్తి అయిన సందర్బంగా చార్జీల పెంచాలని గత ప్రభుత్వాన్ని కోరింది ఎల్ అండ్ టి సంస్థ. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చార్జీల పెంపు ప్రతిపాదన తోసిపుచ్చింది. ఇప్పుడు ఛార్జీలు పెంచలేమని, ఎన్నికల తర్వాత చూద్దామని చెప్పి ఆ వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టింది.

 

తాజాగా మెట్రో ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. బెంగళూరు తరహాలోనే హైదరాబాద్ మెట్రో చార్జీలు సైతం పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును పబ్లిక్-ప్రయివేటు పార్టనర్ షిప్ పద్దతిలో నిర్మాణం చేపట్టారు. ఈ మెట్రో వ్యవస్థను నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ, దీన్ని నడుపుతోంది.

 

మెట్రో రైలు చట్టం ఏం చెబుతోంది?

 

మెట్రో రైలు చట్టం ప్రకారం.. హైదరాబాద్‌ మెట్రోకు మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ) గా ఎల్ అండ్ టీ ఉంది. ఆ సంస్థకు-రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభంలో మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది. రేట్లను సవరించాలంటే కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీ మాత్రమే ఉంది. ఈ కమిటీని నియమించాలని గతంలో కేంద్రాన్ని కోరింది. కమిటీ వేయడం కూడా రెండేళ్ల కిందట జరిగిపోయింది.

 

ప్రజల అవసరాల కోసం ఇప్పటికే మెట్రో విస్తరణ చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో కొత్త ట్రైన్లు, కోచ్ లు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తోంది. కాకపోతే నిధుల సమస్య అడ్డంకిగా మారింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కోరింది. చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

హైదరాబాద్‌లో రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్లల్లో 57 స్టేషన్లలో సేవలు అందిస్తోంది మెట్రో. మినిమన్ 10 రూపాయల నుండి మాక్సిమమ్ 60 రూపాయల వరకు ప్రస్తుతం ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు మెట్రో తరహాలో రేట్లు పెంచేందుకు నిర్వహణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బెంగుళూరు మెట్రో దాదాపు 50 శాతం పైగా రేట్లు పెంచింది.

 

హైదరాబాద్ మెట్రో చార్జీలు 30 నుండి 40 శాతం వరకు పెంచాలని ఆ సంస్థ కోరనున్నట్లు సమాచారం. చార్జీల పెంపు అంశంపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోంది. ఒకవేళ పెంచితే ఈ స్థాయిలో ఛార్జీలు పెంచుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎల్ అండ్ టీ మాత్రం బెంగుళూరు మాదిరిగా పెంచాలని డిమాండ్ చేస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాన్ని కొద్దిరోజులు పెండింగ్‌లో పెడుతోందా? రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10