ప్రముఖ బాలీవుడ్ హీరో సోనూ సూద్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలో సోను సూద్ఎక్కువగా విలన్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. సినిమాలతో పాటు ఈయన చేసే సేవా కార్యక్రమాలతో ఎంతో ఫేమస్ అయ్యారు. కొన్ని పాత్రలు చెయ్యాలంటే అది కేవలం ఆయనకే సాధ్యం..తాజాగా ఈయన పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్ లోని లుథియానా కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అసలేమైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నటుడు సోనూ సూద్ ఓ కేసు లో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. ముంబై లోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లుథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంజ్ జారీ చేశారు. సోనూసూద్ ను అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఆ ఉత్తర్వులను భేఖాతర్ చేస్తే ఉల్లంఘన కింద కఠిన చర్యలు తప్పవని అందులో పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. లుథియానా కు చెందిన అడ్వకెట్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సోనూ సూద్ సాక్షిగా ఉన్నారని సదరు న్యాయ మూర్తి తెలిపాడు.. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు సోనూ సూద్ కు నాన్ బెయిలాబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూసూద్ కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరవ్వలేదు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసును ఈ నెల 10 న మరోసారి విచారణ జరిపించడం ఉన్నట్లు తెలుస్తుంది.
ఆ విచారణ లో కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈయన సినిమాల గురించి అందరికీ తెలుసు. బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలలో కూడా ప్రత్యేక పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కోవిడ్ సమయంలో తన దాత్రుత్వంతో చాలా మందిని ఆదుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన మెగాఫోన్ పట్టుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని రూపొందించారు.. హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సీరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి.. ఇక తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. కీలక పాత్రల్లో నటిస్తూ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు