అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత చేసిన రెండో సినిమా ‘యానిమల్’తో దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సందీప్ మెగాస్టార్ చిరంజీవి అభిమాని అనే విషయం తెలిసిందే. తాజాగా ఈ దర్శకుడు తన ఆఫీస్ తాలూకు ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అందులో మెగాస్టార్ ఫొటోఫ్రేమ్ కనిపించింది.
ఇక ఈ పోస్టుకు ఆయన ‘భద్రకాళి ఆఫీస్’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పోస్టు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఈ పోస్టును షేర్ చేస్తూ మెగాభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తే చూడాలని ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
కాగా, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందని సమాచారం. మరోవైపు చిరంజీవి కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీని తర్వాత అనిల్ రావిపూడితో చిరు సినిమా చేస్తారని టాక్.