పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేసాల్లో సభ ముందుకు పలు బిల్లులు రానున్నాయి. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉండనుంది. బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెడతామని.. సహకరించాలని ప్రభుత్వం తెలిపింది. అఖిల పక్షం సమావేశంలో కేంద్రం ఈ విషయం ప్రకటించింది. ఇక ప్రయాగ్ రాజ్‌లో జరిగిన తొక్కిసలాటపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై తొలి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచే అవకాశం ఉంది. క్శనివారం నాడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ఆర్థిక సర్వేను, శనివారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఇందులో మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి.
బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు మొత్తం 16 బిల్లులు ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో కీలకమైన వక్స్ సవరణ బిల్లు కూడా ఉంది. ఫైనాన్స్ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఆయిల్ ఫీల్డ్స్ చట్టాల సవరణ బిల్లు లతో పాటు బాయిలర్స్, మర్చంట్ షిప్పింగ్, కోస్టల్, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినల్స్ బిల్లుల వంటివి ఇందులో ఉన్నాయి. బిల్లులో ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్, త్రిభువన్ శాకరీ యూనివర్సిటీ, 2025 ఫైనాల్స్ బిల్లు ఉన్నాయి. గత సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న మరో 10 బిల్లులు సభకు రానున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీల్లో మెజార్టీని ఉపయోగించి అజెండాను కేంద్రం బలవంతంగా రుద్దుతున్నదని విపక్షాలు ఆరోపించాయి. మరోవైపు ప్రయాగ్ రాజ్ లో జరిగిన తొక్కిసలాటపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై తొలి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందిన సభ్యులు ఉండటంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.