AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ యథాతథం..

ఇంటర్ ఫస్టియర్‌ పబ్లిక్ ఎగ్జామ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మధ్యే విద్యాశాఖలో మార్పులు చేయాలని నిర్ణయించారు.. అందులో ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. CBSE సిలబస్ ప్రవేశ పెట్టె ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామని వెల్లడించిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌లో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.

 

అయితే, ఇంటర్‌ పరీక్ష విషయంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం వంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26వ తేదీ వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ఆసక్తికరమై ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది.. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదవుపై ఫోకస్ పెట్టరని.. అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది ఇంటర్‌ బోర్డ్. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.. అయితే, గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇవ్వనున్నారు.. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్‌.. రెండు భాష సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరిగా ఉండనుంది.. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకునే వీలుంది.. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్‌ బోర్డు సమావేశం నిర్వహించి తీర్మానం చేయనుంది

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10