AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ – 2025 క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు కేసీఆర్ కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు.

 

తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కార్యక్రమ నిర్వాహకుడు కొంపెల్లి నరేశ్, నేతలు బోయపల్లి నాగరాజు, కురవ పుల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా కొంపెల్లి నరేశ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రికెట్ పోటీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10