AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేషన్‌కార్డుల మంజూరు పై బిగ్ అప్డేట్..!

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ముహూర్తం గా నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే గ్రామ.. బస్తీ సభలు నిర్వహిస్తోంది. రేషన్ కార్డుల దరఖాస్తుల కు వస్తున్న స్పందనతో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని నిర్ణయించింది. తాజా సభల్లో ఇచ్చే దరఖాస్తులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రులు చెబుతున్నారు. ఇక, ఇదే సమయంలో హైదరాబాద్ లో మాత్రం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

కొనసాగుతున్న సభలు

రేషన్ కార్డుల జారీ పైన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ – బస్తీ సభలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ లో మాత్రం సభలు ప్రారంభం కాలేదు. దీంతో.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్ లో మొదలు అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. కొంత ఆలస్యం అయినా అర్హులు అందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పెద్ద సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే, ప్రభుత్వం హైదరాబాద్ లో ఇంకా సభలు నిర్వహించకపోవటంతో ఈ చర్చ మొదలైంది.

 

పెరుగుతున్న దరఖాస్తులు

అయితే, ప్రజాపాలన సభలు, మీసేవా కేంద్రాలకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని అర్హులని గుర్తిస్తామని మంత్రులు చెబుతున్నారు. అర్హుల పరిశీలన సమయాన్ని పొడిగించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం ముందుగా ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ, బస్తీ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు మరో రోజు మాత్రమే గడువు ఉంది. కానీ, సభలకు వస్తున్న స్పందన.. రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న దరఖాస్తులతో సభల నిర్వహణ గడువు పొడిస్తారా లేదా అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. రేషన్ కార్డులకు పథకాలను అనుసంధానం చేస్తుండటంతో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు చెబుతున్నారు.

 

26 నుంచి ఆరంభం

అదే విధంగా ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల కోసం తుది కసరత్తు జరగనుంది. ఆ నాలుగు పథకాల అమలు లో భాగంగా దరఖాస్తులను ప్రస్తుత గ్రామ, బస్తీ సభల్లో పరిశీలన చేస్తున్నారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులో పేర్కొన్న వారి నుంచి కుటుంబ సభ్యు లు, ఆధార్, ఫోన్‌ నంబరు, కులం, చిరునామా వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో, హైదరాబాద్ లో మాత్రం రేషన్ కార్డుల పంపిణీ లో కొంత జాప్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ANN TOP 10