కస్టమర్లకు ఎయిర్ టెల్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రీఛార్జ్ పై 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్ప్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, రూ. 1999 రీఛార్జ్ పై 336 రోజుల పాటు డేటా లేకుండా అపరిమిత కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ లు లభిస్తాయని ప్రకటించింది. గతంలో ఈ ప్లాన్లపై కొన్ని జీబీల డేటాను కూడా ఎయిర్ టెల్ కంపెనీ అందించేది. కానీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలతో భారత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్ టెల్ వాయిస్, SMS-మాత్రమే ప్రీపెయిడ్ ప్లాన్‌లను మాత్రమే ఇప్పుడు ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌లు ఏవీ ప్రారంభించనప్పటికి.. TRAI ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న ప్లాన్లను సవరించింది.
అయితే, ఎయిర్ టెల్ యొక్క రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఇప్పుడు 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు 900 SMS ఎస్ఎంఎస్ లు పొందవచ్చు.. మరోవైపు, సంవత్సరం పాటు రీఛార్జ్ చేసుకునే ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రూ. 1,999 ప్లాన్ అన్ లిమిటెడ్ కాల్స్, 3,600 SMSలను అందిస్తుంది. ఇవి 365 రోజుల చెల్లుబాటు అవుతాయని పేర్కొనింది. అదనపు ఎయిర్‌టెల్ రివార్డ్‌లలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో ఉచిత కంటెంట్ , అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్స్ కూడా వినియోగించుకోవచ్చని భారతి ఎయిర్ టెల్ ప్రకటించింది. గతంలో, ఈ ప్లాన్ కు 24 జీబీ డేటాతో ఉండేది. కాగా, ఎయిర్‌టెల్ ఈ ప్రస్తుత ప్లాన్‌ల నుంచి డేటా ప్రయోజనాలను తీసివేసింది. దీంతో పాటు మార్కెట్‌లో వాటి ధరలను అలాగే కొనసాగిస్తుంది.