AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు..

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ‘బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు’ కీలకమైంది. అయితే, దీనిపై అమెరికా వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏకంగా 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటానికి సిద్దమయ్యాయి. ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే దానిని సవాలు చేస్తూ కోర్టులో దావాలు వేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా సహా మొత్తం 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయంపై మండిపడుతున్నాయి.

 

ఈ వ్యవహారంపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ స్పందిస్తూ.. అమెరికా రాజ్యాంగం ప్రకారం యూఎస్ఏలో జన్మించిన వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని చెప్పారు. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని జన్మహక్కుగా మార్చారని వివరించారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ట్రంప్ తన పరిధిని దాటారని ఆరోపించారు. కాగా, జన్మత: లభించే ఈ పౌరసత్వ హక్కును మార్చడం అంత సులభం కాదని అమెరికా రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ఇప్పటికే 22 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న కారణంగా రాజ్యాంగ సవరణ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10