కథానాయకుడు రామ్‌చరణ్-బుచ్చిబాబు కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, అండ్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమాకూరుస్తున్నారు.
ఇటీవల మైసూర్ షెడ్యూల్‌తో చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా చిత్రీకరణకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ కోసం రామ్‌చరణ్ ఈ చిత్రం షెడ్యూల్‌కు కాస్త బ్రేక్ ఇవ్వడమే అందుకు కారణం. కాగా ఈ నెల 27 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ చేయనున్నట్లు తెలిసింది.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని, ఈ చిత్రంలో కథానాయకుడు క్రీడాకారుడిగా కనిపిస్తాడని సమాచారం. అయితే ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రానికి గత కొంత కాలంగా ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
చిత్రానికి ఈ టైటిల్‌ను పెట్టడానికి కూడా కథలో ఓ బలమైన అంశం ఉంటుందట. ఈ టైటిల్ మాస్‌గా, పవర్‌ఫుల్‌గా కూడా ఉండటంతో చిత్ర యూనిట్ కూడా ఇదే టైటిల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. మార్చిలో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జగపతిబాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.