AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అయ్యగారి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని అఖిల్(Akkineni Akhil).. ఈయన్ని అందరూ అయ్యగారు అని పిలుస్తూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ అఖిల్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం తగ్గదు.ఈయన అందానికి ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అలాంటి అక్కినేని అఖిల్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఇక అఖిల్ గత ఏడాది నవంబర్ 26న జైనబ్ రావ్డ్ జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అఖిల్ మొదట శ్రియా భోపాల్ (Sriya bhopal) తో ఎంగేజ్మెంట్ ఎంత గ్రాండ్ గా చేసుకున్నారో దానికి భిన్నంగా చాలా సింపుల్ గా జైనబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే అఖిల్ జైనబ్ ల నిశ్చితార్ధ వేడుక జరిగింది.ఇక వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాగార్జున ఫోటోలు షేర్ చేసే వరకు కూడా ఎవరికి తెలియదు. అంత గుట్టుగా ఈ విషయాన్ని ఉంచారు.

 

అఖిల్ పెళ్లి ఫిక్స్..

 

అలా ఫైనల్ గా అక్కినేని అఖిల్ కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని, కొడుకుకి సంబంధించిన గుడ్ న్యూస్ ని నాగార్జున అభిమానులతో షేర్ చేసుకున్నారు.అయితే నాగచైతన్య(Naga chaitanya ), శోభిత(Shobhita) పెళ్లి జరిగిన సమయంలోనే అఖిల్, జైనబ్ ల పెళ్లి కూడా జరుగుతుందని,ఇద్దరి పెళ్లిని ఒకేరోజు నాగార్జున చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ రూమర్లని నాగార్జున కొట్టి పారేశారు. అలాగే అఖిల్ పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు అఖిల్ పెళ్ళికి సమయం వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ స్పెషల్ రోజు అక్కినేని అఖిల్ జైనబ్ లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోయేది ఎప్పుడో ఇప్పుడు చూద్దాం..

 

అఖిల్ పెళ్లి అప్పుడే..

 

అక్కినేని అఖిల్, జైనబ్ రావ్డ్ జీల పెళ్లి మార్చి 24న జరగబోతున్నట్టు సినీ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. అయితే వీరి పెళ్లి విదేశాల్లో జరగబోతుందని, పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరవుతారని, కానీ ఇండియాలో జరగబోయే రిసెప్షన్ పార్టీలో కుటుంబ సభ్యులు,ఫ్రెండ్స్, బంధువులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలెబ్రిటీలు, క్రికెటర్స్,బిజినెస్ మాన్ లు కూడా పాల్గొనబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి అక్కినేని అఖిల్, జైనబ్ ల పెళ్లి మార్చి 24న జరగబోతుంది అనే వార్తలపై అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సిందేనని అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి అఖిల్ పెళ్లి మార్చిలోనే జరగబోతుందా.. లేదా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ రూమరా అని..

 

జైనబ్ బ్యాక్ గ్రౌండ్..

 

ఇకపోతే అక్కినేని ఇంటికి కాబోయే చిన్న కోడలు జైనబ్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. జైనబ్ తండ్రి వైయస్ జగన్ కి సన్నిహితుడని కూడా వార్తలు వినిపించాయి.ఇక మరొక విషయం ఏమిటంటే.. అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ తనకంటే వయసులో దాదాపు 11 ఏళ్లు పెద్ద..ఈ విషయం వినడానికి చాలా వింత అయినప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమకి ఏజ్ అడ్డు పడలేదు. అలా దాదాపు 11 ఏళ్లు పెద్దదైన జైనబ్ ప్రేమలో అఖిల్ పడిపోయాడు.

 

అఖిల్ సినిమాలు..

 

అఖిల్ సినిమాల విషయానికొస్తే..’అఖిల్’అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి సినిమాలతో వచ్చాడు. ఇక ఈ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్ప మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్సే కావడం గమనార్హం.

ANN TOP 10