AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మద్యం కేసులో అసలు భాగస్వామి ఆప్..రేవంత్ కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్‌ను తెలంగాణలో ఓడించామని.. ఇదే కేసులో అసలు పార్ట్ నర్ ఆప్ ను కూడా సాగనంపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను దోచుకున్నదని, భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నేతలను కేసులు వెంటాడుతున్నాయన్నారు. ఢిల్లీలో సైతం లిక్కర్ పాలసీ మాటున ఆమ్ ఆద్మీ పార్టీ ఖజానాకు తూట్లు పొడిచి రాజకీయ అవసరాలకు వాడుకున్నదని, ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అవినీతిని అడ్డుకుంటే ఆ నిధులతో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి మంచి చేయవచ్చునని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేసిందని గుర్తుచేశారు. ఢిల్లీలో సైతం కాంగ్రెస్ ఇకపైన అదే చేస్తుందని, ఈసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రధానిగా ఉన్న మోడీ పదేండ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీలకు రూ. 16 లక్షల కోట్ల మేర మాఫీ చేశారని, తాము ఇప్పుడు దావోస్ సమ్మిట్‌కు వెళ్తున్నామని, పర్యటన ముగిసిన తర్వాత ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామో ప్రజలకు వివరిస్తామన్నారు.

 

ఆప్, బీజేపీ ఒక్కటే..

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీ రాజకీయంగా వేర్వేరు పార్టీలైనా ఆ రెండూ ఒక్కటేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. హామీల అమలులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్, దేశ ప్రధానిగా మోడీ ఫెయిల్ అయ్యారని అన్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన సీఎం రేవంత్.. అక్కడ అధికారంలోకి వస్తే రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్‌ను ఇస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని హామీలను రిలీజ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాదిలోనే అమలు చేశామని, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ. 21 వేల కోట్ల మేర రైతు రుణమాఫీని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేశామని గుర్తుచేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలన్నింటినీ అమలు చేస్తుందని భరోసా కల్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. పై రెండు హామీలను గురువారం మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.

 

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం

మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండడం కాంగ్రెస్ పార్టీ లక్షణమని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని అమలులోకి తెచ్చిందని, ఏపీలో పార్టీ మొత్తానికి తుడిచిపెట్టుకుపోయినా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీకి నష్టం జరిగినా వెనకడుగు వేయలేదన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని, మెట్రో రైల్ లాంటి సౌకర్యాలన్నీ ఆమె హయాంలో ఉనికిలోకి వచ్చినవేనని గుర్తుచేశారు. ఇప్పుడు ఢిల్లీలో అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారని, కాలుష్యంతో రోగాలబారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్, దేశ ప్రధానిగా మోడీ ఢిల్లీ నగరానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇద్దరూ కలిసి ఢిల్లీ నగరాన్ని నాశనం చేశారని, అందుకే వీరిద్దరూ వేర్వేరు కాదని, ఒక్కటేనని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

 

ఢిల్లీని బాగు చేయడం కాంగ్రెస్ తోనే సాధ్యం

ఢిల్లీని మళ్లీ బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు గ్యారంటీల హామీలను ఇచ్చామని, వాటిని విజయవంతంగా అమలు చేసి ప్రజలకు ఫలాలు అందిస్తున్నామని గుర్తుచేశారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా అలాంటి హామీలనే ఇస్తున్నామని, ఈసారి ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ ఇచ్చిన హామీ ప్రకారం 11 సంవత్సరాల్లో 22 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉన్నదని, కానీ ఆయన ఇచ్చింది కేవలం ఏడు లక్షలేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే 51 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామని గుర్తుచేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తుచేశారు.

 

లిక్కర్ పార్టనర్‌ను ఓడిస్తాం : సీఎం రేవంత్

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్‌ను తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించామని పేర్కొన్న సీఎం రేవంత్.. ఈ కేసులో అసలు పార్టనర్‌గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కాంగ్రెస్ ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను దోచుకున్నదని, భారీ అవినీతికి పాల్పడిన ఆ పార్టీ నేతలను కేసులు వెంటాడుతున్నాయన్నారు. ఢిల్లీలో సైతం లిక్కర్ పాలసీ మాటున ఆమ్ ఆద్మీ పార్టీ ఖజానాకు తూట్లు పొడిచి రాజకీయ అవసరాలకు వాడుకున్నదని, ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అవినీతిని అడ్డుకుంటే ఆ నిధులతో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి మంచి చేయవచ్చునని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేసిందని గుర్తుచేశారు. ఢిల్లీలో సైతం కాంగ్రెస్ ఇకపైన అదే చేస్తుందని, ఈసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రధానిగా ఉన్న మోడీ పదేండ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీలకు రూ. 16 లక్షల కోట్ల మేర మాఫీ చేశారని, తాము ఇప్పుడు దావోస్ సమ్మిట్‌కు వెళ్తున్నామని, పర్యటన ముగిసిన తర్వాత ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామో ప్రజలకు వివరిస్తామన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10