నటుడు మోహన్ బాబు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులను మోహన్ బాబు సిబ్బంది వేటాడారు. అడవి పందిని వేటాది తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ఎలక్ట్రిషన్ దుర్గాప్రసాద్ అడవి పందిని వేటాడి బంధించి మరీ తీసుకువెళ్లాడు. దీంతో కిరణ్, దుర్గ ప్రసాద్ ఇద్దరి చర్యలను తప్పుపడుతూ మంచి మనోజ్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అడవి పందులను వేటాడొద్దని వారించినప్పటికీ మేనేజర్, ఎలక్ట్రిషన్ పట్టించుకోని పరిస్థితి. మరోవైపు మేనేజర్ కిరణ్ అడవి పందిని వేటాడి తీసుకువెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది జల్పల్లి అటవీప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు వద్ద పనిచేసే మేనేజర్ కిరణ్‌పైనే ప్రధాన ఆరోషణలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిషన్ దుర్గాప్రసాద్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి.
వేటాడవద్దని వారించినప్పటికీ కూడా కిరణ్, దుర్గాప్రసాద్ పట్టించుకోకుండా అడవి పందులను వేటాడుతున్నారని పలుమార్లు వారిని మందలించినట్లుగా తెలుస్తోంది. వారి చర్యలను తప్పుబడుతూ కిరణ్, దుర్గాప్రసాద్ ఇద్దరికీ కూడా మంచు మనోజ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం ఆ వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ వీడీయోలు ఎప్పటివి, అడవి పందులను ఎప్పుడు వేటాడారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.