మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణ శానససభ ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. సోమవారం 10 గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.
సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు స్పీకర్. అవసరమైన కావల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు స్పీకర్. ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాలని ఆదేశించారు.
డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలో మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. యూపీఏ హయాంలో రెండు పర్యాయాలు ప్రధానిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పడిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో సభ ఆయనకు ప్రత్యేకంగా నివాళులు అర్పించనుంది.