AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

Swiggy Report 2024: హైదరాబాద్ వాసులు బిస్కెట్స్‌లా కొనేసిన కండోమ్ ప్యాకెట్స్, లక్షల్లో ఆర్డర్స్..!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తాజాగా 2024కు సంబంధించి వార్షిక రిపోర్టు రిలీజ్ చేసింది. ఆ రిపోర్టులో హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా ఏఏ ఐటెమ్స్ ఆర్డర్ చేశారోనన్న వివరాలను వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. హైదరాబాద్ వాసులు ఎంతటి ఆటగాళ్లో అర్థమైపోతుంది. అది చూసి చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు.

అవును మీరు విన్నది నిజమే.. ఎక్కువ మంది మిల్క్ నుండి మ్యాగీ నూడుల్స్ వరకు, కొత్తిమీర నుండి కండోమ్స్‌ వరకు బాగా ఉపయోగించుకున్నట్లు రిపోర్టులో వెల్లడించింది. దీంతో చిన్న చిన్న ఐటెమ్‌కు చాలా మంది స్విగ్గీనే ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి అత్యధిక మంది ఆర్డర్ చేసిన ఐటెమ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్లు చెదిరే కండోమ్ ఆర్డర్స్

స్విగ్గి మరో షాకింగ్ రిపోర్టును కూడా వెల్లడించింది. కేవలం మ్యాగీలు, కూరగాయలు, ఐస్ క్రీమ్‌లు మాత్రమే కాకుండా.. హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా కండోమ్‌లు కూడా ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్‌లు వచ్చినట్లు నివేదికలో పేర్కొంది. మరీ ముఖ్యంగా స్విగ్గీలోని ఇన్‌కాగ్నెటో మోడ్‌లో 1,300 కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్టు వెల్లడించింది. ఇది తెలిసి అంతా ఖంగుతిన్నారు. ఏంటి భయ్యా ఇవి బిస్కెట్‌ ప్యాకెట్లు అనుకున్నారా? లేక ఇంకెమైనా అనుకున్నారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ వాసులూ మంచి ఆటగాళ్లే అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు.

ఎక్కువగా మ్యాగీ నూడుల్స్

2024లో హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. దాదాపు 25 మిలియన్లకు పైగా వీటిని ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. దీంతో దీని వినియోగం గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం మ్యాగీ వినియోగం పెరిగినట్లు వెల్లడించింది. ఇక మ్యాగీ ఒక్కటే కాకుండా దీనితోపాటు హైదరాబాద్ వాసుల టాప్ ఫుడ్ ఆర్డర్‌లలో పాల ఉత్పత్తులు ఉన్నాయని పేర్కొంది.

దాదాపు 19 లక్షలకు పైగా పాల ఉత్పత్తుల ఆర్డర్‌లు చేసినట్లు స్విగ్గి తెలిపింది. ఇవి మాత్రమే కాకుండా హైదరాబాద్ ప్రజలు మరికొన్ని ప్రొడక్టులపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపించారు. 2024లో నగర ప్రజలు ఎక్కువగా ఐస్‌క్రీమ్‌ వినియోగించినట్లు తెలిపింది. ఈ ఐస్‌క్రీమ్ కోసం ఏకంగా రూ.31 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10