ఫార్ములా ఈ-కారు రేసు కేసు తెలంగాణలో హీట్ క్రియేట్ చేస్తోంది. ఓవైపు ఏసీబీ..ఇంకోవైపు ఈడీ దూకుడు పెంచుతున్నాయి. లేటెస్ట్‌గా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7న విచారణకు రావాలని పిలిచింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
అంతేకాకుండా ఈ కేసులో ఏ-2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏ-3లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారిని జనవరి 2, 3 తేదీల్లో ఈడీ విచారించనుంది. ఏసీబీ FIR ఆధారంగా ప్రివెన్షన్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ విచారణ జరుపుతోంది.
మరోవైపు ఏసీబీ ప్రాథమిక విషయాల ఆధారంగా లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ- కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసును సవాల్ చేస్తూ..కేటీఆర్ ఇప్పటికే హైకోర్టుకెళ్లారు. ఈ కేసులో ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సేమ్‌టైమ్ హైకోర్టులో రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు కేటీఆర్.
నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఉత్కంఠ
ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంక్‌దే అని కేటీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
అయితే ఫార్ములా ఈరేస్ కేసులో ఇటు ఏసీబీ, అటు ఈడీ కేసులు నమోదు చేయటంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శిబిరంలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే నమోదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ దోస్తీ రాజకీయాలు చేస్తూ..కేటీఆర్‌పై కుట్ర చేస్తున్నాయని విమర్శిస్తోంది.
ఏసీబీ కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఈడీ ఎంట్రీ ఇవ్వటమే ఇందుకు ఎగ్జాంపుల్ అని చెబుతోంది. ఈ కేసులపై న్యాయపోరాటం చేస్తామని..ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని వాదిస్తోంది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.