AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాన్నకు ప్రేమతో.. హిమాన్షు పాటకు కేటీఆర్ ఎమోషనల్ పోస్టు.. వీడియో వైరల్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయపరమైన విమర్శలను గుప్పించడమే కాదు.. ప్రజా సమస్యలతో పాటు సామాజిక అంశాలపై కూడా కేటీఆర్ ఎక్కువగా స్పందిస్తుంటారు. కొన్నిసార్లు తన ఫ్యామిలీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను కూడా పోస్టు చేస్తుంటారు. తాజాగా కేటీఆర్ తన కుమారుడు హిమాన్షు పాడిన పాటను ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

కుమారుడు పాటకు కేటీఆర్ భావోద్వేగం :
తన తండ్రి అంటే ఎంతో ఇష్టమో తెలిపేలా హిమాన్షు రావు.. “ఓ నాన్న నువ్వు నా ప్రాణం.. ‘‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే… నాన్నా..’’ అంటూ పాటను చాలా అద్భుతంగా పాడాడు. తన పుట్టినరోజు కోసం హిమాన్షు పాడిన ఈ పాటను ఇప్పుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

వాస్తవానికి, గత జూలైలో తన పుట్టినరోజు కోసం హిమాన్షు తన వాయిస్‌తో ఈ పాటను పాడి రికార్డు చేశాడని కేటీఆర్ చెప్పారు. అప్పటి పరిస్థితుల కారణంగా హిమాన్షు పాట వీడియోను రిలీజ్‌ చేయడం సరికాదని తన కుమారుడు భావించాడని కేటీఆర్‌ తెలిపారు. ఇది తనకు వారం క్రితమే తెలిసి మొదటిసారి పాటను విన్నానని చెప్పారు.

తండ్రిగా గర్వపడుతున్నా.. థ్యాంక్యూ బింకూ :
‘‘ఈ కష్టతరమైన ఏడాదిలో ఈ ఎమోషనల్ వీడియో నాకు బెస్ట్ గిఫ్ట్. నీ గానం నాకు చాలా నచ్చింది. తండ్రిగా చాలా గర్వపడుతున్నా’’ అని కేటీఆర్‌ పోస్టులో పేర్కొన్నారు. హిమాన్షు పాడిన పాటకు.. కేటీఆర్ థ్యాంక్యూ బింకూ (హిమాన్షు) అంటూ ప్రశంసించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10